Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
మండల కేంద్రంలో పశు వైద్యాధికారి రవిప్రసాద్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల్లో కలిగే గర్భకోశ వ్యాధులపై రైతులకు అవగాహన కల్పించారు. సీజనల్‌గా పశువులకు వచ్చే గర్భకోశ వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు మల్లికార్జున్, అసిఫా, రవికుమార్, శ్రీనివాస్, నరేష్, గోపాల మిత్రలు నాగేల్లి శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.