Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
అధికారంలో ఉండి రైతు ధర్నా పేరుతో టీఆర్ఎస్ నిరసన తెలపడం సిగ్గు చేటని కాంగ్రెస్ మండలాధ్యక్షులు కొణతం చిన్న వెంకట్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న వారే రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మించలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాఅధ్యక్షులు నూకల సందీప్‌రెడ్డి, కౌన్సిలర్లు బచ్చలకూరి ప్రకాష్, రణపంగ నాగయ్య, బైరెడ్డి జితేందర్‌రెడ్డి, నాయకులు రాచకొండ అజరు, ఖాదర్‌ఖాన్, మచ్చ శ్రీను, ఆరే కృష్ణారెడ్డి, పాల్వాయి కృష్ణమూర్తి, గజ్జల కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.