Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతగిరి
మండల పరిధిలోని పాలవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రీచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు లింగారెడ్డి, రీచ్ ఫౌండేషన్ ఖమ్మం కోఆర్డినేటర్ వంశీ పాల్గొన్నారు.