Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చింతలపాలెం
పోడు భూముల దరఖాస్తులపై అవగాహనా సదస్సు నిర్వహించినట్టు ఎంపీడీవో గ్యామానాయక్ తెలిపారు. శుక్రవారం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించి పోడు భూముల దరఖాస్తులపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో షేక్ మౌలానా, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.