Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాలకవీడు
మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో ఆ సంఘం నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. మండలాధ్యక్షునిగా వేముల రామయ్య, ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ రహీం, పిట్టల రామయ్య, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు, సహాయ కార్యదర్శిగా దేవానందం, కోశాధికారిగా తిరుపతయ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎలక సోమయ్యగౌడ్, సీఐటీయూ జిల్లా నాయకులు అనంత ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.