Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మఠంపల్లి
నియోజకవర్గంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 16 మంది తాత్కాలిక ఉద్యోగులకు రెండేండ్ల పాటు వేతనం అందించేందుకు సాగర్ సిమెంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రమణమూర్తి విలేకర్లతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచన మేరకు జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు అభ్యర్థన మేరకు రెండేండ్ల పాటు రూ.38 లక్షలా 40 వేల వేతనం అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల వేతనం రూ.16,0000 మఠంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో అందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.