Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్ల బ్యాడ్జీలతో ముస్లిముల నిరసన
నవతెలంగాణ-మిర్యాలగూడ
త్రిపుర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జమైత్ ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలోని డీఏవో మౌలానాకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనకు ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, సీపీఐ(ఎం) నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డిలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు మౌలానా ఖస్మి, మగ్గం మౌలానా, ముఫ్తి రియాజ్ మాట్లాడుతూ త్రిపుర రాష్ట్రంలో అల్లరిమూకలు అమాయక ముస్లిములు, వారి ఇండ్లు, దుకాణాలపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారన్నారు. మసీదులను ధ్వంసం చేస్తూ, ముస్లిం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు అహ్మద్ చావుష్, హాఫిజ్ ఉద్దీన్, మౌలానా హిడ్రిస్, ముఫ్తి ఇమ్రాన్, మౌలానా ఇషాక్,ముఫ్తి నాజమోద్దీన్, అబ్దుల్ సలీం షైక్ అహ్మద్, ఆయూబ్, మగ్గం, కౌన్సిలర్ ఘని, జానీ, సలీం, రహమాన్ ఖాన్, సాజిద్ ఖాన్,వసీం, గయస్ పాల్గొన్నారు.