Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీసీఎంఎస్ చైర్మెన్ వట్టె జానయ్య యాదవ్
నవతెలంగాణ - సూర్యాపేటరూరల్
రైతును అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో పీఏసీ ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు తేమ లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. కాంటాలు, ఎగుమతుల్లో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండల్ రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యులు మాలి కవిత అనంతరెడ్డి, మాజీ ఎంపీ టీసీ బండి ప్రభాకర్‌రెడ్డి, మారం చంద్రారెడ్డి, మం డల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.