Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నాంపల్లి
గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ వివిధ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.19,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాదెపాక మరియమ్మ, వంగూరి ఈరమ్మ, గాదెపాక లక్ష్మమ్మ, ఎదుళ్ల పార్వతమ్మ, ఎదుళ్ల వెంకటయ్య, ఎదుళ్ల బిక్షమయ్య, ఎదుళ్ల రాములమ్మ, నర్సమ్మ, ఎదుళ్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.