Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరిరూరల్
మండల పరిధిలోని అనంతారం ఆదర్శ పాఠశాలలో జాతీయ సాధన సర్వే - 2021 పరీక్ష శుక్రవారం నిర్వహించారు. ఈ పరీక్ష నిర్వహణను మండల విద్యాధికారి శాంతయ్య పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ పాఠశాలల్లో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 3,5,8, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను వివిధ సబ్జెక్టుల్లో పరీక్షిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వేముల బాలరాజు, పరీక్ష పరిశీలకులు డి.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.