Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చివ్వెంల
బాల్య వివాహనాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మశ్రీ కోరారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని బండమీది చందుపట్ల గ్రామ అంగన్వాడీ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డకు శ్రేయస్కరమ న్నారు. ఐసీడీఎస్ జిల్లా ఇన్చార్జి నరేష్ మాట్లాడుతూ పిల్లలపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే 100కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చలమయ్య, పారా లీగల్ వాలంటీర్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ జంపాల వెంకటేశ్వర్లు, గుద్దేటి వెంకన్న, జెడ్పీహెచ్ఎస్ చందుపట్ల ప్రధానోపాధ్యాయులు అశోక్, అంగన్వాడీ టీచర్లు గుద్దేటి జానమ్మ, అన్నపూర్ణ, ఏఎన్ఎం శంకరమ్మ, శైలజ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.