Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ
వివక్ష పూరిత వైఖరికి విడనాడాలి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
గుంటకండ్ల జగదీష్ రెడ్డి
నవతెలంగాణ - చివ్వేంల
'టీఆర్ఎస్ అంటేనే రైతు పార్టీ.. మాది రైతు ప్రభుత్వం..రైతులపై చీమ వాలినా కేసీఆర్ ఊరుకోరు. ఎంతకైనా కొట్లాడుతారు..కేసీఆర్ పిడికిలి బిగిస్తే కేంద్రం అతలాకుతలం అవుతుంది. ఇక ఉరుకునేది లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని కొంటారా..లేదా'..అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం మండల పరిధిలోని దూరాజ్‌పల్లిలో ఏర్పాటు చేసిన రైతుల మహాధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట శనిలా దాపురించిందన్నారు. ధాన్యం విషయంలో బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అడుగడుగునా నిలదిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు తెరుకుంటున్నారని, ఆర్థికంగా పరిపుష్టం అవుతున్నారని చెప్పారు. ఇంతలోనే కేంద్రం కక్ష కట్టి ధాన్యం కొనబోమంటూ మేళికలు పెట్టిందన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు రైతులపై ప్రేమ లేదన్నారు. ధాన్యం కొంటామని కేంద్రం నుంచి లెటర్ తెస్తే బీజేపీ నాయకులకు గౌరవం దక్కుతుందని, లేకపోతే గ్రామాల్లో బీజేపీ నాయకులను రైతులే తరిమి కొడతారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మెన్ వట్టే జానయ్య యాదవ్, జెడ్పీ వైస్ చైర్మెన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్మెన్ పేరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్మెన్ లలిత ఆనంద్, టీఆర్ఎస్ చివ్వేంల మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్‌రెడ్డి, ఎంపీపీ కుమారి బాబునాయక్, జెడ్పీటీసి భూక్య సంజీవ్ నాయక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రౌతు నరసింహారావు, కౌన్సిలర్ భాష, భూక్య వెంకటేశ్వర్లు, రామగిరి నగేష్, ఉట్కూరి సైదులు, రావిచెట్టు సత్యం, హనుమంతరావు, కోటేశ్వర్రావు, పల్లెటి నాగయ్య, జాల జైరామ్, జటంగి నాగరాజు, రమేష్‌రెడ్డి, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
దమ్ముంటే ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం నుంచి ఆర్డర్ తేవాలి
తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌కుమార్
నవతెలంగాణ - తుంగతుర్తి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకు దమ్ముంటే వారంలోగా 1.5 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకురావాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ సవాల్ విసిరారారు. కేంద్రప్రభుత్వ నిరంకుశ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పార్టీ మండలాధ్యక్షులు తాటికొండ సీతయ్య అధ్యక్షతన మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు తెలంగాణ రైతులకు మద్దతివ్వక పోగా ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను సమూలంగా నాశనం చేయడంతో పాటు రాజ్యాంగ విధులను నెరవేర్చకుండా పారిపోవడం అలవాటుగా మారిందన్నారు. వ్యవసాయోత్పత్తుల కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని భారత రాజ్యాంగంలోని 246 అధికరణ పేర్కొంటోందని, కానీ ఈ బాధ్యతను విస్మరించి బీజేపీ ప్రభుత్వం రైతుల వెన్నువిరిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఏడాదిగా రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసినంత మేలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేయలేదన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసేలా తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొచ్చిందని, రైతులకు అప్పుల బాధ ఉండొద్దని వారికి పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా రూ.10 వేలు రైతుబంధు రూపంలో అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గంలోని 9 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్, సింగిల్‌విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మెన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, పాలకేంద్రం చైర్మెన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నరు..
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ - కోదాడరూరల్
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో రైతులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర పన్ని ధాన్యం కొనబోమంటూ ప్రకటన చేసి రైతులను నట్టేట ముంచే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను సీఎం కేసీఆర్ తిప్పి కొడుతూ రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారని చెప్పారు. యాసంగి పంట కొనుగోలు చేసేంత వరకూ పోరాటం ఆపేది లేదన్నారు. రైతులను రాజులు చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. పంజాబ్‌లో రాష్ట్రంలో ధాన్యం కొన్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఎందుకు కొనదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
రైతులు కన్నెర్ర చేస్తే బీజేపీ మాడి మసైతది
హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నవతెలంగాణ - హుజూర్నగర్
దేశంలోని రైతులంతా కన్నెర్ర చేస్తే బీజేపీ ఆ మంటల్లో మాడి మసైతదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యపు రాశులను చూసి కేంద్రం కళ్లు మండుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్ట చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు చేయదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గేల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, హరికృష్ణ, బెల్లంకొండ అమర్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు దొంతిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.
రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్
నవతెలంగాణ-హాలియా
యాసంగిలో రైతు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. శుక్రవారం హాలియాలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. రైతు సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం రాజకీయం
దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. వరి ధాన్యం కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడంతో ధాన్యం అధికంగా రైతుల చేతికి వస్తుందని,దీంతో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను దష్టిలో పెట్టుకొని రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఆర్టికల్ 246 ప్రకారం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా బీజేపీ నాయకులు కలెక్టర్ కార్యాలయాల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు చేసి అబద్దపు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, మాదవరం సునీత జనార్థన్‌రావు, జెడ్పీటీసీలు మారుపాకుల అరుణ సురేశ్‌గౌడ్, మాదవరం దేవేందర్‌రావు, బాలు, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, మండల పార్టీ అధ్యక్షులు టీవీఎన్.రెకడ్డి, రమావత్ దస్రు, లోకసాని తిరుపతయ్య, ముత్యాల సర్వయ్య, శేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, వల్లపురెడ్డి, రైతుబంధు అధ్యక్షులు సిరందాసు కష్ణయ్య, గోపాల్‌రెడ్డి, కంకణాల వెంకట్‌రెడ్డి, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, కుంభం శ్రీనివాస్‌గౌడ్, నేనావత్ శ్రీను, చింతపల్లి సుభాష్, నేనావత్ రాంబాబునాయక్, వేముల రాజు, బొడ్డుపల్లి కష్ణ పాల్గొన్నారు.
ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి..
ఎమ్మెల్యే భాస్కర్‌రావు
నవ తెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కరరావు మాట్లాడుతూ దొడ్డు రకం ధాన్యం కేంద్రం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆరేండ్ల క్రితమే లెవీ సేకరణ నిలిపివేసిందన్నారు. దీని వల్ల దొడ్డు రకం పండించిన రైతులు, మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార ధాన్యాల నిల్వలు అధికంగా ఉన్నాయని సాకు చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మాజీ మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకలు సరళ హనుమంతరెడ్డి, వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్రావు, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బాబయ్య, మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు.