Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రారంభించిన అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో ని న్యూ డైమెన్షన్ స్కూల్ లో మూడు రోజుల పాటు జరిగే 5వ రాష్ట్ర స్థాయి జూనియర్ హాకీ టోర్నమెంట్స్ శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ప్రారంభించారు. అర్జున అవార్డు గ్రహీత, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముకేష్ కుమార్ , జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కే ధనంజనేయులు , జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ , జనరల్ సెక్రెటరీ లచ్చు హాజరయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ దీపక్‌తివారి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి క్రీడ హాకీ టోర్నమెంట్స్ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. హాకీ క్రీడలో దేశానికి ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు క్రీడాకారులు ,కోచ్‌లు మరింత కషి చేయాలన్నారు. జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో హాకీ టోర్నమెంట్స్‌కు వేదిక కావడం అదష్టమన్నారు. అర్జున అవార్డు గ్రహీత, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ పిల్లల ప్రాథమిక స్థాయి నుండే క్రీడల పట్ల అవగాహన ఏర్పరచి చదువుతో పాటు క్రీడలలో రాణించేట్టుగా తీర్చిదిద్దాలన్నారు.
గెలుపొందిన జట్టు వివరాలు : హైదరాబాద్ టీం మహబూబ్ నగర్ టీంతో తలపడగా హైదరాబాద్ పైన మహబూబ్ నగర్ 1-3 స్కోరు తో గెలుపొందింది. ఖమ్మం జట్టు పైన కరీంనగర్ 0-2 గెలుపొందింది. అదిలాబాద్ జట్టుపై హైదరాబాద్ 1-3 స్కోరుతో గెలుపొందింది. నల్గొండ జట్టుపై రంగారెడ్డి 0-2 కోరుతూ గెలుపొందింది. వరంగల్ పై నిజామాబాద్ జట్టు 0-2 తో గెలుపొందింది. ఖమ్మం జట్టుపై మహబూబ్ నగర్ 1-4 తో , రంగారెడ్డి జట్టుపై మెదక్ 0-2 స్కోరుతో గెలుపొందిన ట్లు హాకీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పది జిల్లాల హాకీ జట్లు, కోచ్ లు , న్యూ డైమన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ సుభాష్ రెడ్డి, హాకీ సభ్యులు లచ్చు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.