Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతి
నవతెలంగాణ-మిర్యాలగూడ
త్రిపుర రాష్ట్రంలో ముస్లిము లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యం లో శనివారం ఆర్డీవో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ త్రిపురలో ముస్లిములపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ముస్లిములకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, కౌన్సిలర్లు రవి నాయక్, శేఖర్ రెడ్డి, జానీ, మొయిజ్, అజహర్, అనిల్, అబ్దుల్లా, సీపీఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సయ్యద్, సమీఖాద్రి, పరంగి రాము తదితరులు పాల్గొన్నారు.