Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
ప్రభుత్వ వైద్యశాలల్లోనే మెరుగైన వైద్యం లభిస్తుందని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని అక్కెనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య, వైద్యా రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గర్భిణుల కోసం కేసీఆర్ కిట్‌తో పాటు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఆస్పత్రి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించారు. వైద్యాధికారి జమున మాట్లాడుతూ గ్రామంలోని సబ్ సెంటర్‌కు ముందు భాగంలో ప్రహరీ గోడను నిర్మించాలని ఎంపీపీని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదాస్ చంద్రశేఖర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.