Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దవూర:తెలంగాణలో నిరుద్యో గులెదుర్కుంటున్న సమస్యలపై ఈ నెల 16న బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి ప్రదీప్‌కుమార్, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి కంకణాల నివేదితరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ ఏడేండ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.