Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు:బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిపైనా ఉందని కొండాపురం సర్పంచ్ బరిగెల యాదమ్మ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా శనివారం అంగన్వాడీ సెంటర్లోని చిన్నారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అవ్వారు నాగమణి, బరిగెల రమణమ్మ, ఏఎన్ఎం మంజుల, ఆశావర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు