Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నకిరేకల్
పట్టణంలోని తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా కవి కాళోజీ నారాయణరావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు వరికుప్పల రాందాస్, టౌన్ అధ్యక్షులు ఐటీపాముల గిరి, నకిరేకల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కముల శ్రీనివాస్, నకిరేకల్ యూత్ అధ్యక్షులు సంగపాక సతీష్, షేక్.నజీర్, గంజి రమేష్, మోహన్, శేఖర్ పాల్గొన్నారు.
.