Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
నతెలంగాణ - నల్లగొండ
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మండలం దండెంపల్లి, రెడ్డికాలనీ గ్రామాల్లో రెండు గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కంట్రోల్ పాయింట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించొచ్చని తెలిపారు. కేసులు చేధించడం, దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎంతగానో దోహద పడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ చింత పుష్ప సైదులు, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్, రెడ్డి కాలనీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు రాజశేఖర్, రూరల్ పోలీస్ సిబ్బంది రమేష్, కిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.