Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగార్జున సాగర్
3విద్యుత్ సంస్థలో పనిచే స్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్లను ఎత్తివేయాలనే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని తెలంగాణ మాల విద్యుత్ ఉద్యోగుల వ్యవస్థాపక అధ్యక్షుడు బురుగుల విజయ భాస్కర్రావు హెచ్చరించారు. శనివారం నందికొండ మున్సిపాలిటి పైలాన్ జెన్కో కార్యాలయంలో సీఈ సూర్యనారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 62 వల్ల విద్యుత్ సంస్థలో పనిచేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమ ప్రమోషన్లు, సీనియార్టీని కోల్పోయే అవకాశం ఉందన్నారు. గతంలో ఏ విధంగా రిజర్వేషన్ అమల్లో ఉందో అదేవిధంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాడువేల శ్రీను, కార్యదర్శి గొల్లపూడి జైపాల్, జయపాల్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.