Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
నేడు చండూరులో నిర్వహి ంచనున్న టీఎస్‌యూ టీఎఫ్ జిల్లా విస్తత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్.మట్టారెడ్డి కోరారు. శనివారం మండల కేంద్రంలో సంపత్ అధ్యక్షతన నిర్వహించి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై టీఎస్‌యూటీఎఫ్ నిరంతరం రాజీ లేని పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డి.బుచ్చయ్య, జింకల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు, కందుల చినవెంకటేశ్వర్లు, బొరిశెట్టి శ్రీనివాస్, కె.పరంగి పాల్గొన్నారు.