Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగార్జునసాగర్
ఉపాధ్యాయులు విద్యార్థులకు నూతన బోధన విధానాలను అనుసరించాలని తెలంగాణ ప్రాంత అధికారిణి సీతా కిరణ్ కోరారు. నందికొండ మున్సిపాలిటీ పైలాన్ జెన్కో డీఏవీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎ.భార్గవ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఉపాధ్యాయ శిక్షణలో ఆమె మాట్లాడారు. జాతీయ విద్యావిధానం, విద్య ప్రాముఖ్యత, కేంద్రీకృత విద్యను విద్యార్థులకు అందించాలని కోరారు.