Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భారత దేశ కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముంద్రించే వరకు ఉద్యమాలు చేయాలని ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి కోరారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహంకు జ్ఞానమాలను సమర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మునిసిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ , రైతు సమన్వయ మండల కమిటీ చైర్మెన్ కంచి మల్లయ్య, సాధన సమితి జిల్లా నాయకులు బండారు రవివర్దన్ పాల్గొన్నారు.