Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన పబ్బతి మట్టయ్య 125 వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు పబ్బతి వెంకయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఆ గ్రామంలో అన్నదానం నిర్వహించారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ చైర్స్, గ్రామ ప్రజలకు కాటన్ హ్యాండ్ బ్యాగులు పంపించేశారు. ఈ కార్యక్రమంలో మట్టయ్య కుమారులు చంద్రయ్య, వెంకయ్య, రాజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.