Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం యాదాద్రిబువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చేనేత కార్మికుడు మహేశ్వరం సోమయ్య (70) చేనేత వత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. సోమయ్య కొంత కాలంగా అనారోగ్యానికి గురికావడం, చేనేత పనితో చేసిన పనికి గిట్టుబాటు కాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురైన సోమయ్య ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి మున్సిపల్ కేంద్రంలోని పశువుల సంతలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ మెట్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లారిన తర్వాత వ్యవసాయ బావుల వద్దకు వెళుతున్న రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ యాదయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేటఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. మతుడు సోమయ్యకు భార్య చంద్రమ్మ, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.