Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
సహకార వారోత్సవాలలో భాగంగా మండల ంలోని చిలుకూరు,బేతవోలు,పాలఅన్నారం గ్రామాల్లో ఆయా సంఘాల అధ్యక్షులు అలసకాని జనార్దన్, భాష్యంసైదులు,కొండా సైదయ్య ఆయా కార్యాలయాల్లో ఆదివారం జెండాలను ఘనంగా ఎగరవేసి ఉత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 68వ అఖిలభారత వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు ఉంటాయన్నారు.ఈ ఏడాది ఎజెండాగా సహకారం ద్వారా శ్రేయస్సు అనే అంశాన్ని తీసు కున్నామన్నారు.వారం రోజులు జరిగే ఉత్సవాల్లో సహకార ఉద్యమవ్యాప్తికి దిశానిర్దేశం చేయడంలో భాగంగా సంఘాలు తమ విజయగాథలను ప్రచారం చేసుకునేందుకు సాధించిన ఫలితాలను ప్రదర్శిం చేందుకు,భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తు న్నామన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కస్తూరి సైదులు, గన్న అశోక్, రమేశ్,సైదులు, లక్ష్మయ్య, సైదమ్మ, ఆయా సంఘాల సీఈఓలు చిలువేరు లక్ష్మీనారాయణ, ఎస్కె.భాష, సాకి వెంకటేశ్వర్లు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.