Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ-మోత్కూరు
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు డిమాండ్ చేశారు. ఈ నెల 16, 17, 18తేదీల్లో హైదరాబాద్ సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సీఐటీయూ ఆలిండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయ వంతం చేయాలని కోరుతూ ఆదివారం మోత్కూరులో వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అను కూలంగా చేసి కార్మికుల జీవితాలను తాకట్టు పెట్టారని, ప్రభుత్వ నిర్ణయంతో లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కూళ్ల రాములు, నాయకులు డి.భిక్షం, కూరెళ్ల యాదయ్య, కూరెళ్ల శేఖర్, నగేష్,బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.