Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
మున్సిపాలిటీలోని బీసీగురుకుల పాఠశాల గ్రౌండ్లో జీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ జిల్లా రగ్బీ టోర్నమెంట్, సెలక్షన్స్ నిర్వహించారు.ఈ టోర్న మెంట్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల నుండి మొత్తం 24 జట్లు పాల్గొ న్నాయి.నల్లగొండ, హుజూ ర్‌నగర్, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేట, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నుండి జట్లు పాల్గొన్నాయి.ఈ కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి,పెద్దవూర ఎంపీపీ సలహాదారుడు సుందర్‌రెడ్డి, కోఆర్డినేటర్ తరుణ్‌రెడ్డి, సెక్రెటరీ దాసరిపృథ్వీరాజ్, పెద్దవూర ఎంఈఓ. శ్రీనివాస్, కందికట్ల దాస్, వెంకటయ్య, శివ పాల్గొన్నారు.