Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మలు లక్ష్మీ
నవతెలంగాణ-సూర్యాపేట
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటూ ఇబ్బంది పెడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీవిమర్శించారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని కష్ణ థియేటర్ సమీపంలోని పార్టీ పట్టణ ప్రథమమహాసభ కమిటీ సభ్యులు అర్వపల్లి లింగయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.ధాన్యంకొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్లు ధాన్యం కొనుగోలు విషయంలో నాటకాలాడుతూ రైతులను ఇబ్బందులు పెడుతున్నాయని విమర్శించారు.అధికారంలో ఉన్న రెండు పార్టీలు ధాన్యం కొనుగోలు చేయకుండా ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బండి సంజరు రాష్ట్రంలో టీఆర్ఎస్పై విమర్శలు చేయడం కాదని..కేంద్రంలో ఉన్న మీ పార్టీ ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రకటింపజేయాలని కోరారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల బతుకులను బజారున పడేసిందన్నారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్యాస్, పెట్రోలు,డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని విమర్శించారు.పేద ప్రజలపై భారాలు మోపుతూ పెద్దలకు రాయితీలు కల్పించడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కరోనా కాలంలో పేదలు ఇబ్బందులు పడుతున్నారని నిల్వఉన్న ఆహార ధాన్యాలు పంచాలని డిమాండ్ చేస్తే పంచకుండా ఇప్పుడు ఆహార ధాన్యాలు మోతాదుకు మించి నిల్వ ఉన్నదనే పేరుతో ధాన్యం కొనుగోలు చేయలేమని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.వేల టన్నుల కొద్ది ఆహారధాన్యాలను పేదలకు పంచకుండా సముద్రాల పాలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో బీజేపీతో మెతకవైఖరి అవలంబిస్తూ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం మూలంగానే హుజూ రాబాద్లో ఓటమి పాలైందన్నారు. ఉపఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఏదో ఒక ధర్నా చేయడం లాంటివి చేసి ప్రజలను పక్కదారి పట్టించడంకోసం ఆడుతున్న నాటకాలని విమర్శి ంచారు.క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని,కార్యకర్తలను కాపాడుకుంటూ పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు.ఈ టౌన్ మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, వన్ టౌన్ కార్యదర్శి ఎల్గూరి గోవింద్, జిల్లా కమిటీ సభ్యులు కోటగోపి,మట్టిపల్లి సైదులు,జె.నర్సింహారావు, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎల్గూరి జ్యోతి, నాయకులు చిన్నపంగి నర్సయ్య, పట్టణ కమిటీ సభ్యులు సాయికుమార్, మామిడి సుందరయ్య, మామిడి పుల్లయ్య, మరిపెళ్లివెంకన్న, నర్సింహారావు, షేక్సైదులు, షేక్ జహంగీర్, గండమళ్ళ భాగ్యమ్మ,పిట్టల రాణి, జయమ్మ, శశిరేఖ, సూర్యకళ, ఎల్గూరి లక్ష్మీ, భిక్షమమ్మ, గూడూరులక్ష్మీ, సునీత పాల్గొన్నారు.