Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
మండలపరిధిలోని రెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మతి చెందిన ఉయ్యాల భద్రయ్య, అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జక్కుల యాదగిరి కుటుంబాలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆదివారం పరామర్శించారు.వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు.అనంతరం మాట్లాడుతూ వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు రేతినేని శ్రీనివాసరావు, జక్కుల శ్రావణ్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దగ్గుల మల్లయ్యయాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు కోడి కుమార్‌యాదవ్, అశోక్‌యాదవ్, ఎల్లేష్, వెంకటేష్, మహేష్, రాజు పాల్గొన్నారు.