Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
పట్టణంలోని ముత్యాలమ్మ బజార్లో ఐద్వా మహిళా సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహిళలెదుర్కొంటున్నసమస్యలపై సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిమ్మల పద్మ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా మహిళల బతుకులు చాలా దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల కుటుంబం గడవడం చాలా కష్టంగా మారిందని వాపోయారు. కరోనా వైరస్ కారణంగా గతంలో మాదిరిగా ఉపాధిపనులుదొరకడం లేదన్నారు. మహిళల పట్ల లైంగిక వేధింపులు కూడా ఎక్కువయ్యాయన్నారు.ఈ కార్యక్రమంలో పద్మ, జహంగీర్బీ, సుజాత, లలిత, వరలక్ష్మీ పాల్గొన్నారు.