Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్తా చాటుతానంటున్న 'తరుణ్'
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండలంలోని అవంతీపురంలో గల గిరిజన గురుకుల బాలుర కళాశాల విద్యార్థి సపావట్ తరుణ్ అండర్ 17 కబడ్డీ పోటీలకు అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రెండో స్థానం సాధించిన తరుణ్ ఇండోనేపాల్లో ఈనెల 19,20,21వ తేదీలలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికై ఆడనున్నారు.చదువులో ప్రతిభ కనబరిచడంతో పాటు క్రీడల్లోనూ తరుణ్ కనబరిచాడు.పేద గిరిజన కుటుంబానికి చెందిన తరుణ్ అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఆర్థికఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. కనీసం రవాణా చార్జీలకైన ఆర్థికసాయం అందిస్తే కబడ్డీపోటీల్లో ప్రతిభ కనబరిచి దేశానికి పేరు తీసుకొస్తానని పేర్కొన్నారు.దాతలు ముందుకొచ్చి ఆర్థికసాయం అందించి పేదక్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపర్చిచేల ప్రోత్సహించాలని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథనాయక్ కోరారు.ఆర్థికసహాయం చేయదలచిన వారు 99480 54272కు సంప్రదించాలని కోరారు.