Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
విద్యార్థుల కోసం నిరంతరం పరితపించిన మహానుభావుడు జవహార్‌లాల్ నెహ్రూ అని మేరీ మదర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ విజ్జి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆ పాఠశాలలో బాలలదినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి బాలలే రేపటిపౌరులని గుర్తించిన మహ నీయుడు నెహ్రూ అన్నారు.ఆయనకు పిల్లలంటే అమితమైన ప్రేమ అన్నారు.అనంతరం వివిధసాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ రిన్సీ, హెలెన్,జ్యోతి,మెటిల్డ, వెంకన్న,గోపగాని లింగమూర్తి, మహమ్మద్ షకీల్, మహమ్మద్ ఆదిల్, విజరు, నాగరాజు, శంకరయ్య, సంధ్య,ఉమ, సునీత, సంధ్యారాణి, రజిత, అలేఖ్య, నసీమా, అనూష, విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.