Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సేవ, త్యాగానికి ప్రతిరూపం కమ్యూనిస్టు
రాజకీయ శిక్షణాతరగతులో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
సమాజం కోసం, సమస్యల పరిష్కారం కోసం పనిచేసేది కమ్యూనిజమని, సేవకు, త్యాగానికి ప్రతిరూపం కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.ఆదివారం స్థానిక టీఎన్ఆర్ గార్డెన్ లో పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహి ంచారు.'పార్టీ కార్యక్రమం- విశిష్టత అంశం'పై రాష్ట్ర నాయకులు సోమయ్య బోధించారు. పోరాటాలతో పుట్టుకొచ్చిన పార్టీ నేటికి వర్గ పోరా టాలు నిర్వహిస్తోందని చెప్పారు.దోపిడీకి వ్యతిరేకంగా వర్గ ప్రయోజనాల కోసం నిస్వార్ధంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నామన్నారు.డబ్బుకు, ఆశకు, భయానికి, రక్త సంబంధాన్ని సైతం లొంగనది కేవలం కమ్యూనిస్టు అని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలకు పనిచేయడమే కార్యకర్త పని అని అన్నారు. రాజకీయాల్లో కమ్యూనిజానికి ఒక విశిష్టత ఉన్నదని, నీతికి, నిజాయితీకి మారు పేరు ఎర్రజెండా అన్నారు.రాజకీయాలు నేడు మారిపోయాయని, అన్ని డబ్బుతో కుదురుకున్నాయని చెప్పారు.బూర్జువా పార్టీలు ప్రజలను తాత్కాలిక ప్రయోజనాలను ఆశ చూపి అధికారంలోకి వస్తున్నాయని విమర్శిం చారు.మానవ సంబంధాలన్ని ఆర్థికసంబంధాలుగా మారిపోయాయన్నారు.నేడు వారే రాజ్యాన్ని ఏలుతున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. భవిష్యత్‌లో వర్గ పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అధికారంలో ఉన్న పాలకులు వారి ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని, ఎర్ర జెండా అధికారంలో ఉన్న ప్రాంతంలో ప్రజల ప్రయో జనాలే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఇప్పటివరకు పెట్టుబడి దారి వర్గాలకు అనుకూలంగా పాలకులు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పేద వర్గాలను కలుపుకొని ఉద్యమాలు చేయాలని, దోపిడీ ఉన్న ప్రాంతాలలో వర్గ పోరాటాలు చేయాలని కోరారు.కార్యకర్తలు నిత్యం ప్రజా పోరాటాలు చేయాలని, సమస్యలు పరిష్కరిచడమే లక్ష్యంగా పోరాటాలు నిర్వహించా లన్నారు.నీతి, నిజాయితీ, నిబద్ధతతో క్యాడర్ పనిచేయాలన్నారు. ప్రిన్సిపాల్‌గా నూకలు జగదీష్ చంద్ర వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు డబ్బికార్ మల్లేష్, నాయకులు డా. మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, పాదూరి శశిధర్‌రెడ్డి, భావండ్ల పాండు, వినోద్, బాలసైదులు, రెముడాల పరుశరామ్, అంజద్, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరి గోవర్థన, రొండి శ్రీనివాస్, భావండ్ల పాండు, అయ్యూబ్, బాబునాయక్ పాల్గొన్నారు.