Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజిలెన్స్ డీఎస్పీ కష్ణయ్య
నవతెలంగాణ-అనంతగిరి
కులాలకతీతంగా పేద విద్యార్థులకు అండగా ఉంటామని విజిలెన్స్ డీఎస్పీ అమరగాని కష్ణయ్య అన్నారు.మండలపరిధిలోని పాలవరం గ్రామంలో ఎన్నారైల సహకారంతో గ్లోబల్ కౌండిన్య ఆర్గనైజేషన్ ద్వారా గ్రామానికి చెందిన భార్గవి అనే పేద విద్యార్థినికి ఉన్నత చదువుల నిమిత్తం రూ.5 వేల ఆర్థికసాయం అంద జేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం గౌడ సంఘం విద్యార్థులే కాకుండా అట్టడుగు వర్గాల పేద విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం సహకారం అందిస్తామన్నారు.భార్గవి మూడేండ్ల కాలంలో తన పై చదువుల నిమిత్తం అయ్యే ఖర్చులన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో గౌడ సంఘం నాయకులతో మాట్లాడుతూ వారికి అందే గౌడ సంఘం పెన్షన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.పెన్షన్ అందని వారు దరఖాస్తు చేసుకోవాలని, వారికి సకాలంలో పెన్షన్ అందజేసే విధంగా చర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో మట్టపల్లి సైదులు, మట్టపల్లి పుల్లయ్యగౌడ్,మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, రామకోటయ్య, బెల్లంకొండ ఏడుకొండలు, మట్టపల్లి సిద్దయ్య పాల్గొన్నారు.