Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడవయ్య అన్నారు. సోమవారం పట్టణపరిధిలోని రాయగిరిలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగుల త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలతో ప్రత్యేక శాఖ, కార్పొరేషన్ సాంఘిక సంక్షేమ శాఖ నుండి వేరుపడి 1983లో వికలాంగుల. శాఖ ఏర్పడిందన్నారు.అంతకుముందు 1981లో ఏర్పడిన వికలాంగుల కార్పొరేషన్ ప్రస్తుతం నిర్వీర్యంచేయడానికి ఉన్నత అధికార్లు ప్రయత్నము చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వికలాంగుల శాఖలో పని చేస్తున్న ఉద్యోగులను మహిళా శాఖలో విలీనంకై నియమాలు, విధానాలు మార్పుకై కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వరూపంగా ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కీసర వెంకట్ రెడ్డి, కోశాధికారి బొల్లేపల్లి స్వామి, ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వెంకట్ నరసింహారెడ్డి, రేణుక, జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత, కో-కన్వీనర్ పద్మ పాల్గొన్నారు.