Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలపరిమితి రెండేండ్లను చివరకు ఏప్రిల్ వరకు అనగానే ఆగ్రహించిన ప్రజలు
సర్పంచ్‌ను ఎంపీఓను నిలదీసిన ప్రజలు
నవతెలంగాణ -వలిగొండ
వలిగొండ మేజర్ గ్రామపంచా యతీలో ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా సర్పంచ్, ఎంపీఓ సొంత అజెండా ప్రకారం వెళుతున్నారని మొదటి నుండి నవ తెలంగాణ పత్రిక లో ప్రత్యేక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే సోమవారం కూడా స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ బోళ్ళ లలిత అధ్యక్షతన ఎంపీఓ కేదారి ఈశ్వర్ ఆధ్వర్యంలో కొనసాగించారు. ముందుగా 10 గంటలకు మొదలైన వేలం పాటలు స్థానిక ప్రజలు నిర్వహిస్తున్న వేలం పాటలు ఏప్రిల్ 31 వరకేనని సర్పంచ్, ఎంపీఓ తెలపడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు .కాలపరిమితి రెండేండ్లు అంటేనే రూ.50,000, రూ.20000, రూ. 10000 డిపాజిట్ చేశామన్నారు. ప్రస్తుతం నాలుగు నెలలే అని చెబుతున్న విషయం ముందే ఎందుకు చెప్పలేదని ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. వారు సమాధానం చెబుతూ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వేలం వేయకుండా తమరికి కేటాయిస్తామని అసంబద్ధంగా ప్రకటించారు. మొత్తం 34 మడి గేలు ఉండగా బాకీలు రూ. 24 లక్షలు వసూలు చేసి డీపీఓ అనుమతి తీసుకొని వేల నిర్వహించాల్సి ఉంది. కానీ పదిహేను రోజుల్లోనే మూడు నోటీసులు ఇచ్చి కేవలం రూ.ఆరు లక్షలు మాత్రమే వసూలు చేశారు. మిగతా 17 లక్షలు వసూలు కావాల్సి ఉన్నది. డిపాజిట్ల రూపంలో రూ.23 లక్షలు వసూలు చేశారు. దరఖాస్తు ఫారం పేరుమీద రూ .35 వేలు వసూలు చేశారు .మొత్తం సుమారు 30 లక్షల వరకు ఎస్టీఓలు జమ చేయకుండానే తమ వద్దే ఉంచుకున్నారు. డబ్బులు చెల్లించని వారి ఆస్తులు జప్తు చేస్తామని క్రిమినల్ కేసులు పెడతామని ఎంపీఓ తెలపడం విశేషం.