Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ కె. రాజేంద్ర ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైదా రవీందర్ మాట్లాడుతూ పట్టణంలోని బస్టాండ్‌లో ఇటీవల రూ.52 లక్షలతో మరమ్మతులు చేయించి ప్రారంభించారన్నారు. ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు బస్టాండ్ లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ డిపోలకు చెందిన బస్సులు బస్టాండ్ లో కి వచ్చే విధంగా చూడాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య, ఆ పార్టీ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, యూసుఫ్, సతీష్ ఉన్నారు.