Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
మండలపరిధిలోని అన్నంపట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సోమవారం బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా సర్పంచ్ బొక్క వసుమతిజైపాల్రెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వద్ధులు, విద్యార్థులకు పండ్లు పంపిణీచేశారు. అనంతరం పాఠశా లలో విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండల్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎలుగు లింగయ్య, ఉపాధ్యాయులు విజయలక్ష్మీ, హారతి, సంధ్యారాణి, వార్డుసభ్యులు పాండు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.