Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్గొండ
ఈ నెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్లో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం జిల్లాకేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో జాతీయ కౌన్సిల్ సమావేశాలు పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్పులు చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక ,రైతు ,ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం పై అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు చేయడానికి ఈ కౌన్సిల్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ అద్దంకి నరసింహ ,పోలే సత్యనారాయణ,సలీవోజు సైదాచారి, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.