Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ పాలశీతలీకరణ కేంద్ర పరిధిలోని పాల ఉత్పత్తి దారుల పరస్పర సహకారసంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నార్ముల్ మదర్డెయిరీలో చైర్మెన్ గంగుల కష్ణారెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆయా గ్రామాల సహకారసంఘాల అధ్యక్షులు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణంలోని పాలకేంద్ర భవనం నీట మునిగి పాలసేకరణ, రవాణా చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని ఛైర్మన్ కష్ణారెడ్డి దష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో తంగడపల్లి, జనగాం, కొయ్యలగూడెం, సైదాబాద్, ధర్మోజిగూడెం, దేశ్ముఖి గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.