Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ధర్నాలు ,పర్యటనలు కాదు, పీఎం దగ్గరకు వెళ్లి బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అర్థరహిత సమస్యను పరిష్కరిం చాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో సీఎంఆర్ కింద బాయిల్డ్ రైస్‌ను దశాబ్దలుగా ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నామని తెలిపారు. నూకలు 30 నుంచి 40 శాతం వరకు వస్తాయని, దీనికి ఎఫ్సీిఐ25 శాతం వరకు మాత్రమే అనుమతిస్తోందని పేర్కొన్నారు. అందుకే యాసంగిలో రా రైస్ ఇచ్చే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ ను ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా అర్థరహితంగా... అసంబద్ధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి విషయాన్ని ప్రధాని నరేంద్రమోడి దష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సిరావడమేనని ధాన్యం కొనుగోలు చేసి బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన నెల, రెండు నెలల తర్వాతే నిధులను విడుదల చేస్తోందని పేర్కొన్నారు.ఒక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల స్టోరేజ్ ఛార్జీలు భరిస్తే అందులో కేంద్రం కేవలం 2 నెలలకు మాత్రమే చెల్లిస్తోందని, తెలంగాణకు హమాలీ చార్జీలు ఒక్క క్వింటాకు కేంద్రం రూ.5.65 మాత్రమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. పంజాబ్, హర్యానల్లో ఒక క్వింటాకు 24.25 చెల్లిస్తోందని,ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ సంచులను కూడా సమకూర్చడంలేదని వివరించారు .