Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు వేదికల్లో ధాన్యాన్ని దాచుకోవచ్చు.
కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు..
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి
నవతెలంగాణ- ఆలేరు రూరల్
ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతు మోసపోవద్దని ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలం లోని కొలనుపాక గ్రామంలో పీఏసీఎస్ చైర్మెన్ మొగులగాని మల్లేశం ఆధ్వర్యంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని తేమ, మట్టి పెళ్ల, తాలు,రాళ్లు రాకుండా తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. వర్షాలు వచ్చినట్టయితే రైతు వేదికలో ధాన్యాన్ని దాచుకోవాలన్నారు. ఫర్టిలైజర్ నిర్వాహకులు కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతామని హెచ్చరించారు. రాఘవాపురం రైతులు సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని అడగడంతో గ్రామానికి రెండు మూడు రోజులు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. నేటి నుండి ఆలేరు మార్కెట్ , కొలనుపాక కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవు తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ రవీందర్ గౌడ్ ,వైస్ చైర్మెన్ నాగరాజు, ఎంపీపీ అశోక్, గ్రామ సర్పంచ్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఉప సర్పంచ్ అనిత అంజయ్య ,రాఘవ పురం సర్పంచ్ రాంప్రసాద్ ,ఎంపీటీసీ ప్రశాంత్ ,తెరాస మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, మండల ఏఓ పద్మజ ,పీఏసీఎస్ డైరెక్టర్ లు నరసింహులు, బిక్షపతి ,మల్లేష్ ,సుదర్శన్ గ్రామ వార్డు సభ్యులు బాలరాజు, పరుశరాములు ,పద్మావతి ,రమాదేవి గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామి ,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.