Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
మండలంలోని బీఎన్. తిమ్మాపురం గ్రామ ఎంపీటీసీ ఉడుత శారదా ఆంజనేయులు ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి పైళ్ల శేఖర్ రెడ్డిని కలిసి ముంపు సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. గ్రామ సమస్యలను మంత్రికి వివరించారు. గ్రామంలో మొత్తం సుమారుగా 1800 ఎకరాలతో పాటు గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతున్నదని తెలిపారు. కేవలం 400 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఎకరానికి 15,60,000 చెల్లించారని మిగతా 1400 ఎకరాలకు అందరికి ఒకేసారి ఎకరానికి 15,60,000 చొప్పున చెల్లించాలని కోరారు. సుమారుగా 100 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న రైతులకు (సీలింగ్ భూములకు) కబ్జాలో ఉన్న రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ సమస్యలన్నింటి పై తానే స్వయంగా కలెక్టర్ వివరించి మూడు నెలల్లోగా నష్ట పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపిపి నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్, వార్డు సభ్యులు కుశంగాల సత్యనారాయణ, జూపల్లి నర్సింహ,దొంకేన అశోక్ గ్రామస్థులు మోర నర్సీ రెడ్డి,మోర రాం రెడ్డి, ఎండి బాబా, కుచుల భిక్షపతి జూపల్లి దేవేందర్ జూపల్లి లాక్మి నర్సయ్య,ఉడుత దేవేందర్,జూపల్లి బాలయ్య,ఎండి షాబీర్, నక్కిరికంటి సుధాకర్ పాల్గొన్నారు.