Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ పమేలా సత్పతి
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
వయోవద్ధులకు ఫిజియోథెరపీ సేవలు నెలలో నాలుగు సార్లు అందించనున్నట్టు వయో వద్ధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం భువనగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న భవిత సెంటర్లో వయోవద్ధులకు అందిస్తున్న ఫిజియో థెరపీ పరీక్షలను జిల్లా కలెక్టర్ పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 15 మండలాలలో వయోవద్ధులకు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి సోమవారం భువనగిరి, మోత్కూరు, చౌటుప్పల్, బొమ్మల రామారం, రామన్నపేట మండలాలో, ప్రతి మంగవారం అలేర్, గుండాల, బీబీనగర్ మండలాల్లో, ప్రతి బుధవారం యాదగిరిగుట్ట, ఆత్మకూర్, తుర్కపల్లి, వలిగొండ మండలాల్లో, ప్రతి గురువారం రాజాపెట్, పోచంపల్లి మండలాల్లో, ప్రతి శుక్రవారం నారాయ ణపూర్ మండలంలో నిర్వహించనున్నట్టు తెలి పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పరిషత్ సిఇఓ కష్ణారెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఎసీపీ వెంకట్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి నరసింహ, జిల్లా మహిళా, వద్ధుల, దివ్యాంగుల సంక్షేమ అధికారి కష్ణవేణి, ఎంపీడీఓ, ఎఫ్ఆర్ఓ తిరుపతి రెడ్డి, వయోవద్ధుల అసోసియేషన్ సభ్యులు పాల్గొ న్నారు.