Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ -చిట్యాల
ఇండిస్టీయల్ పార్క్ పేరుతో వెలిమినేడు గ్రామంలోని పేదల భూములు బలవంతంగా లాక్కోవాలనే ప్రభుత్వ యోచన విరమించు కోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుదాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను వెలిమినేడు భూ నిర్వాసిత రైతులతో కలిసి ఆయన వినతిపత్రం అందజే శారు.ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తాత్కాలికంగా గ్రామ సభలు రద్దు చేయడం కాదని, అధికార పార్టీ శాసనసభ్యులు ,ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం రైతులకు అండగా చూపాలని కోరారు. లేనిపక్షంలో రాజకీయాలకతీతంగా రైతులను సమీకరించి ఆందోళన, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్, చిట్యాల రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీ ను ,రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఐతరాజు నర్సింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు మల్లం మహేష్, అరూరి నర్సింహ, పంది నరేష్, రైతు సంఘం నాయకులు సామ రాంరెడ్డి, మేడి రాములు, మెట్టు నర్సింహ, మేడి స్వామి, శంకరయ్య, కే.రవి ,మెట్టు శ్రీ శైలం, సింగిరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.