Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలంలోని గుజ్జ గ్రామంలో 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుజ్జ గ్రామంలోని పరిసర ప్రాంతాలకు చెందిన 30 మంది విద్యార్థులు సోమవారం బస్సులో స్కూల్ కు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలందరూ క్షేమంగా బయటపడడం తో గ్రామస్తులు తల్లిదండ్రులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సంఘటనకు అతి సమీపంలో పెద్దబ్బాయి బొంద ఉన్నందున మరింత ఆందోళనకు గురయ్యారు. గ్రామంలోని మహారాజుల కాలనీ కి వెళ్లే రోడ్డు మార్గంలో నీటి సరఫరా పైప్లైన్ లీక్ అవడంతో గ్రామ సర్పంచ్ పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందనిని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు పరసనబోయిన కాంతులు అనే వ్యక్తి రోడ్డుకి అడ్డంగా రాళ్లు పెట్టడంతో దారి సరిగాలేకపోవడం ప్రమాదానికి కారణమైన అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ లీకేజీ ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలని రోడ్డు మాకు అందించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.