Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-అర్వపల్లి
ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కొనుగోలు బాధ్యత పూర్తిగా రాష్ట్రప్రభుత్వానిదేనని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.సోమవారం ఆయన మండలకేంద్రంలోని రామన్నగూడెం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మండలకేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించారు.రామన్నగూడెం వద్ద రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.తడిసిన ధాన్యాన్ని కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.వరి ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అంగీకరించక పోవడంతో కొనుగోలు చేయడం కష్టంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు.దీంతో నెల రోజుల నుండి భూషణ్ వరిధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పోసి కొనుగోలు కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.ధాన్యం కొనుగోలు కాకపోవడం మూలంగా కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం గతరాత్రి తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇతర సన్నధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని నిరసన పేరుతో కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు.కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంలో తాలు పేరుతో సక్రమంగా లేదని ఐకేపీ కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నా రన్నారు.నాణ్యత ఉన్న ధాన్యాన్ని, లేని ధాన్యాన్ని ఒకటిగా చూస్తునాన్రని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు..రామన్న గూడెం వద్ద రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని అధికారులతో మాట్లాడాలన్నారు.వెంటనే ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు.ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తామని జిల్లా అధికారులు ఫోన్లో తెలిపారన్నారు.రైతులకు ఎక్కడ సమస్య ఉన్నా తమ దష్టికి తీసుకురావాలన్నారు.ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాటం నిర్వహిస్తామని చేస్తామన్నారు .ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.నేటి వరకు రైతులు యాసంగిలో ఎటువంటి పంటలు వేయాలో పంటలకు అవసరమైన విత్తనాలు రాయితీ వాటిపై ప్రణాళికలు కూడా ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు.దీని మూలంగా రైతుల్లో గందరగోళం ఏర్పడిందన్నారు.వెంటనే వరిసాగుపై ప్రభుత్వం నిర్ణయించాలన్నారు.ఆయన వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముల్కలపల్లి రాములు,కొలిశెట్టి యాదగిరిరావు, యాకలక్ష్మి, వజె శ్రీనివాస్, వజె వినరు, శిగ వెంకన్న ఉన్నారు.