Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్ చైర్మెన్ మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నూతనకల్
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర ద్వారా అందించే అన్ని రకాల రుణాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి కోరారు.సోమవారం మండల కేంద్రంలోని సహకార కేంద్ర బ్యాంకును ఆయన సందర్శించి మాట్లాడారు.ఖాయిలా పడ్డ దీర్ఘకాలిక రుణాలను వసూలు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రుణాలను అందించాలని సకాలంలో రుణాలు వడ్డీలు వసూలు చేస్తే రైతుల తో పాటు పరపతి సంఘాలు కూడా అభివద్ధి చెందు తాయన్నారు. రైతు కుటుంబంలో ఉన్న విద్యార్థులకు ఎడ్యుకేషన్ రుణం రూ.25 లక్షల వరకూ 12 శాతం వడ్డీతో అందజేస్తుం దన్నారు.దీర్ఘకాలిక రుణాలు అయినా ఎడ్యుకేషన్, బిజినెస్ , సైట్ మార్టిగేజ్, టాక్టర్ పౌల్ట్రీ గొర్రెల పెంపకం పందుల పెంపకంపై ఇలాంటి అనేక రకాల మైన రుణాలను సహకార బ్యాంకు అందిస్తుందని తెలిపారు. రుణ గ్రహీతలు సకాలంలో వడ్డీలు చెల్లిస్తే రాయితీలు పొందొచ్చన్నారు.ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు ఇతర రుణాలు ఉన్నప్పటికీ ధాన్యపు డబ్బులను నేరుగా రైతులకు అందజేయాలని బ్యాంకు మేనేజర్‌ను ఆదేశిం చారు.ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ డైరెక్టర్ గుడిపాటి సైదులు, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, కొంతం సత్యనారాయణరెడ్డి, వాయిస్ చైర్పర్సన్ నాగం జయసుధసుధాకర్రెడ్డి, బ్యాంక్ డీజీఎం ఉపేందర్‌రావు, ఏజీఎం కృష్ణలత, మేనేజర్ మాధవి, ఏఎం ప్రసాద్, సూపర్వైజర్ తానాజీ, క్యాషియర్ దివ్య, సీఈఓ సంపెట వెంకయ్య, లక్ష్మారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.