Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలుపుతూ మంగళవారం మండలానికి చెందిన రైతులు వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ధాన్యం కుప్పలు పోసి ధర్నా నిర్వహించారు. అనంతరం ధాన్యాన్ని తగులబెట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్ మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చెరుకు అచ్చయ్యగౌడ్, బీబీనగర్ పీఏసీఎస్ వైస్‌ఛైర్మన్ గడ్డం బాలకష్ణగౌడ్, కాంగ్రెస్‌పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపినాయక్, రాములునాయక్, జిట్టా అమరేందర్‌రెడ్డి, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
రామన్నపేట : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మొలకెత్తిన ధాన్యంతో రైతులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు మెడబోయిన విజయ భాస్కర్, నాయకులు కందుల హనుమంతు మాట్లాడుతూ రైతులు మార్కెట్‌యార్డులో ధాన్యం పోసిన రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారన్నారు. తరచూ వర్షాలు పడుతుం డడంతో ధాన్యం రాశులు తడిసి మొలకెత్తడంతో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీర్ ఖాజా అలీ, మాల్గ లింగయ్య, లచ్చిరెడ్డి, జాల జంగయ్య, వుట్కురి కష్ణ, కొండే మల్లేశం, మొటే రాములు, మోటే సాయిలు, నరసింహ వెంకటేశం పాల్గొన్నారు.
భువనగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం పట్టణంలోని బైపాస్ రోడ్లో సింగన్నగూడెం చౌరస్తా వద్ద ధాన్యం తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారన్నారు. కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ వెంటనే ధాన్యం కొనుగోల్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎన్నబోయిన బిక్షపతి కుంషగుల యాదగిరి తొక్క పురం నరసింహ రాసాల గోపాల్, పోకల దయానంద్, నక్కల ముత్యాలు, ఎన్నబోయిన ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు కసరబోయిన సాయి హరిరాజు, దాసరి మధు, మల్లేష్, మట్ట ఉపేందర్ గౌడ్, వెంకటేష్ మహేందర్ భాస్కర్ మధు పాల్గొన్నారు
భువనగిరిరూరల్ : మండల పరిధిలోని అనాజిపురం ఐకేపీ కేంద్రంలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బంగళవారం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం మాట్లాడుతూ రైతులు వరికోతలు కోసి నెల రోజులు దాటిందన్నారు. వడ్లను ఐకేపీ, సెంటర్ లలో పోసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేశం, నాయకులు బొల్లేపల్లి కుమార్, ఎదునూరి వెంకటేశం, కడారి రాజమల్లు, బొల్లేపల్లి స్వామి, రైతులు శ్రీరామ్ బాలరాజు, నానపురం నాగయ్య, ప్రవీణ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పాండు, సత్యనారాయణ, మల్లేశం, శ్రీశైలం పాల్గొన్నారు.
మోత్కూరు:ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని, వరికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల రోజులు గుడస్తున్నా కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం డిప్యూటీతహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య, సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు అన్నెపు వెంకన్న, పుల్కరం మల్లేష్, నాయకులుగొలుసుల యాదగిరి, సిహెచ్.నర్సయ్య, ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు.